Wednesday, August 22, 2012

నేను స్ప్రైట్ తాగను



నేను స్ప్రైట్ తాగను

సుత్తి లేకుండా
సూటిగా ఏది చెప్పను

నేను కవిని
భావకుడిని
నా పొడుపు కధలు విప్పండి

అందమైన అక్షరాల వెనుక 
అర్దంకాని పదర్ధాన్నెదో దాస్తాను
మీరు గూఢచారిలా
అందులొ నిఘూడంగా నిక్షిప్తమైన
నిధిని వెతికి పట్టుకోవాలి


నేను కవిని
అనుభవీకుడిని

అనుభూతులని అద్భుతంగా మధించి 
అమ్రుతంలో గరళాన్ని
అలవోకగా కలగలిపి
మిమ్మల్ని మెప్పించగలను
మీ కళ్ళను చిప్పించగలను
అందుకొసం ఙ్నాపకాల గునపాలతో
గుండె తవ్వుతూనె వుంటాను


నేను కవిని
ప్రాస రవిని
వికట కవిని

చెట్టు మీది పిట్ట వేసిన
రెట్టలో నానిన రొట్టెను 
బండ మీద తొండతొ 
తినిపించగలను
నా మక తిక మాటలతో
మిమ్మల్ని తికమక పెట్టగలను


నేను కవిని
అనుపమానాలతొ
ఆసనాలు వేయించ గలను

కళ్ళ సంద్రంలో అలలను
పెదాల పడవలపై
చిరునవ్వుల చుక్కానితో 
దాట గలను

నేను కవిని
శాస్త్ర విద్యాకొవిదిడిని

నిఘంటువులు తెచ్చుకొండి
నా సంస్క్రుత సంపాటవంతో
సరలమైన సంగతులను
సంక్లిష్ట శ్లొకాలు చెయ్యగలను


నేను కవిని 
ఆధునీకుడిని

అబ్స్ట్రాక్టిజమ్తో
ఎక్స్పెరిమెంట్లతొ
వైవిద్యత పేరుతొ
వెర్రి వెంగల్లప్పలను చెయ్యగలను
నా మాస్టర్ పీస్ నీకు అబ్జార్బ్ కాలేదా
నీకు మ్యచురిటి డెప్త్ లేనట్టె

మేమెవ్వరము స్ప్రైట్ తాగము

సుత్తి లేకుండా
సూటిగా ఏది చెప్పము 

No comments: