ఎనిమిది సీట్ల Innova లో ఎంజాయ్ చేస్తూ
ఒక్కడే వెళ్తున్నాడు ఏక దంతం
క్రీస్తు పూర్వపు Lunaపై కుచేలురిగా
కుర్షీద్, ఆర్షద్, ఫర్హాజ్
స్కూటీ పై శీలా
స్కూటర్ పై బాలా
బైక్ పై లాలా
మారుతిలో ప్రమీలా
అందరిది ఒకటే గోల
గబా గబా గమ్యం చేరేదేలా?
ఎంత చూసిన సిగ్నల్ మారదు
ఎందుకనో మరి కాలం కదలదు
వడి వడిగా
హడావిడిగా వెళ్తున్నారందరు
ఆఫీసుకి, ఆసుపత్రికి
వ్యాపారానికి, వ్యాహ్యాలికి
గుడి, బడికి
వందలు వందలుగా
పందుల మందలుగా
సందులు గొందులగ
కళ్ళు వుండి చూడలేని
దృతరాష్త్రులు
కాళ్ళుండి నడవలేని
వికలాంగులు
చెవులుండి వినలేని
చవటలు
మయ సభే మహా నగరమంతా .....
నడి నెత్తిన వంతెనలు
కాళ్ళ కింద సొరంగాలు
అడుగడుగున అలవాటైన
గతుకులె కద అని ఆదమరిచవ
అంతు చుసె గుంతలు
జనాభా నియంత్రణ విభాగం
జమ ఖర్చులు ఇచ్చిందెమొ మరి
రొడ్డురవాణా సంస్థకి
రాకాసి బల్లుల్ళా
తిరుగుతున్నాయి బస్సులు
రక్తం రుచి చూసేందుకు
మునిసిపాలిటీ వాళ్ళు
తరుముతుంటే ప్రాణ భయంతో
పరిగెడుతున్న
పిచ్చి కుక్కల్లా ఆటొలు
రణ రంగమే మన నగరమంతా ....
శిరాస్త్రాణాలు, తోలు శంకాలు
ఇనుప రధాలు, హహా కారాలు
పద్మ వ్యూహాలు, క్షతగాత్రులు
వాహనాలు లేని చోటు
నగరమంతా వెదికినా
దొరకదు
రహదారులన్ని సోపానాలే
కైవల్యానికి
కాకుంటే వైకల్యానికి
నగరం నడిబొడ్డున
ఒక తల్లి పేగు తెగింది
శివార్లలో ఒక పుస్తెల
పూటుక్కున రాలింది
రాత్రేమో ఒక రాఖీ
రక్తంతో తడిసింది
పగాలేమో ఒక పెన్షనీరు
చేతి కర్ర విరిగింది
రోడ్డులన్ని తడిసేను రక్తంతో
లేకుంటే కన్నీళ్ళతో
స్మశానమె నగరమంతా...
ఎటు చుసినా ఎనుబోతులపై
యమపాశాలతో కింకరులు
అద్రుశ్య రూపాలలొ
శవం చుట్టు చెరిన
బందువుల రొదననలా
హారన్ల రొద
సగం కాలిన కళెబరపు
దుర్గంధంలా ఘాటైన
పెట్రొలు వాసన
చితి నిండి ఎగిసె
పొగలా
వాహన కాలుష్యం
ట్ర్యాఫిక్ జాం -
సామాన్యుడి సహనానికి దర్పనమా
లేక
మధ్య తరగతి నపుంసకత్వానికి సాక్షమా
నియంత్రణ లేని యంత్రాంగానికి ద్రుష్తాంతరమా
లేక
సామాజిక క్రమశిక్షణా రాహిత్యానికి తార్కానమా
నిబద్ధత లేని పాలకుల నిర్లక్షానికి
నిలు వెత్తు నిదర్శనమా లేక
సామూహిక స్వార్ధానికి ఫలితమా
ఎదైతెనెమి ఓ..నగరజీవి
నీ స్థితి
శ్లేష్మం లో ఈగలా
సాలి డులొ దోమలా
కుడితిలొ ఎలుకలా
కడు
ఒక్కడే వెళ్తున్నాడు ఏక దంతం
క్రీస్తు పూర్వపు Lunaపై కుచేలురిగా
కుర్షీద్, ఆర్షద్, ఫర్హాజ్
స్కూటీ పై శీలా
స్కూటర్ పై బాలా
బైక్ పై లాలా
మారుతిలో ప్రమీలా
అందరిది ఒకటే గోల
గబా గబా గమ్యం చేరేదేలా?
ఎంత చూసిన సిగ్నల్ మారదు
ఎందుకనో మరి కాలం కదలదు
వడి వడిగా
హడావిడిగా వెళ్తున్నారందరు
ఆఫీసుకి, ఆసుపత్రికి
వ్యాపారానికి, వ్యాహ్యాలికి
గుడి, బడికి
వందలు వందలుగా
పందుల మందలుగా
సందులు గొందులగ
కళ్ళు వుండి చూడలేని
దృతరాష్త్రులు
కాళ్ళుండి నడవలేని
వికలాంగులు
చెవులుండి వినలేని
చవటలు
మయ సభే మహా నగరమంతా .....
నడి నెత్తిన వంతెనలు
కాళ్ళ కింద సొరంగాలు
అడుగడుగున అలవాటైన
గతుకులె కద అని ఆదమరిచవ
అంతు చుసె గుంతలు
జనాభా నియంత్రణ విభాగం
జమ ఖర్చులు ఇచ్చిందెమొ మరి
రొడ్డురవాణా సంస్థకి
రాకాసి బల్లుల్ళా
తిరుగుతున్నాయి బస్సులు
రక్తం రుచి చూసేందుకు
మునిసిపాలిటీ వాళ్ళు
తరుముతుంటే ప్రాణ భయంతో
పరిగెడుతున్న
పిచ్చి కుక్కల్లా ఆటొలు
రణ రంగమే మన నగరమంతా ....
శిరాస్త్రాణాలు, తోలు శంకాలు
ఇనుప రధాలు, హహా కారాలు
పద్మ వ్యూహాలు, క్షతగాత్రులు
వాహనాలు లేని చోటు
నగరమంతా వెదికినా
దొరకదు
రహదారులన్ని సోపానాలే
కైవల్యానికి
కాకుంటే వైకల్యానికి
నగరం నడిబొడ్డున
ఒక తల్లి పేగు తెగింది
శివార్లలో ఒక పుస్తెల
పూటుక్కున రాలింది
రాత్రేమో ఒక రాఖీ
రక్తంతో తడిసింది
పగాలేమో ఒక పెన్షనీరు
చేతి కర్ర విరిగింది
రోడ్డులన్ని తడిసేను రక్తంతో
లేకుంటే కన్నీళ్ళతో
స్మశానమె నగరమంతా...
ఎటు చుసినా ఎనుబోతులపై
యమపాశాలతో కింకరులు
అద్రుశ్య రూపాలలొ
శవం చుట్టు చెరిన
బందువుల రొదననలా
హారన్ల రొద
సగం కాలిన కళెబరపు
దుర్గంధంలా ఘాటైన
పెట్రొలు వాసన
చితి నిండి ఎగిసె
పొగలా
వాహన కాలుష్యం
ట్ర్యాఫిక్ జాం -
సామాన్యుడి సహనానికి దర్పనమా
లేక
మధ్య తరగతి నపుంసకత్వానికి సాక్షమా
నియంత్రణ లేని యంత్రాంగానికి ద్రుష్తాంతరమా
లేక
సామాజిక క్రమశిక్షణా రాహిత్యానికి తార్కానమా
నిబద్ధత లేని పాలకుల నిర్లక్షానికి
నిలు వెత్తు నిదర్శనమా లేక
సామూహిక స్వార్ధానికి ఫలితమా
ఎదైతెనెమి ఓ..నగరజీవి
నీ స్థితి
శ్లేష్మం లో ఈగలా
సాలి డులొ దోమలా
కుడితిలొ ఎలుకలా
కడు
No comments:
Post a Comment