Wednesday, August 22, 2012

నగరంలొ వర్షం



నగరం ఇప్పుడు వర్షంలో
అభ్యంగన స్నానంచేసి
తలతుడుచు కుంటున్న
అందమైన ఆడపిల్ల కాదు

తడిసి చలికి వణుకుతున్న 
బుజ్జి
గజ్జి
కుక్క పిల్ల

ఒకప్పుడు వర్షమంటె వళ్ళు పులకరించేది
ఇప్పుడు గుండె జలదరిస్తుంది
చినుకంటె వణుకు పుడుతుంది

అవి నాలుగు పడితె చాలు
నగరానికి పక్షవాతం వస్తుంది
పిల్లలు బడికెల్లలేక
ఉద్యొగులు పనికెల్లలేక
ప్రయాణికులు వూరెల్లలేక
వ్యాపారులు వర్తకం చేయలేక
అస్తవ్యస్త దినచర్యలతో కుస్తి పడాలి


ఒకప్పుడు వర్షమంటె నగరం
గంతులేసె మణిరత్నం గీతాంజలి 

ఇప్పుడు వర్షం అంటె 
సామన్య జన జీవనానికి ...శ్రద్దాంజలి

విధ్యుత్ ఘాతానికి
విరిగి పడే వ్రుక్షాలకి
విష జ్వరాలకి
నానిన గోడలకి
కూలె వంతెనలకి
కనిపించని డ్రైనెజి గుంతలకి
కనికరం లేని ట్రాఫిక్కి
మరణించె
విగత జీవులకు...నిత్య నివాళి


వర్షానికి ట్రఫిక్ జాములు
నిజంగానె గులాబు జాములవుతున్నాయి

కొన్ని వందల కర్ణుల రధ చక్రాలు 
భూమిలోకి కూరుకు పొతున్నాయి
గిత్తల్లా పరిగెట్టాల్సిన బండ్లు
నత్తల్లా కదులుతున్నాయి

రహదారులకు వేసిన " రోడ్డనె" అందమైన మేకప్ కరిగి
గుంటలు పడిన విక్రుత రూపమ్ పైకొచ్చింది
ఇప్పుడి గతుకుల నడుమ
అతుకులు వెతుకుతూ వెల్లాలి
ఇంతకంటే నక్సలైట్లు పేర్చిన
మందుపాతరల మధ్య నించి
వెల్లడం సులువేమో

నల్లాలు కబ్జాలై
నగరం సాగరం అవుతుంది
ఇక వర్షంలో వెల్లాలంటె 
గొడుగులు సరిపొవు
పడవలు కావాలి

ఇప్పుడిక వర్షంలొ
పగటిపూట
పద్మవ్యుహాల్ని చేదించాలి
రాత్రైతె 
రాతి యుగంలో జీవించాలి (కరెంటు కొత)
రక్త దానాలు చెయ్యాలి (దోమల వాత)

ఒకప్పుడు వర్షమంటె మట్టి సువాసన 
ఇప్పుడు మురుగు నీటి కంపు

అయినా మనం...

ప్లాస్టిక్ కవర్సె వాడతాం
ఎక్కడపడితె అక్కడ చెత్త పడెస్తాం
ఉమ్ముతాం ఉస్తామ్
బస్ స్టాప్స్ దగ్గర బహిరంగ మూత్ర విసర్జన ఆపం
చెరువులు ఆక్రమిస్తాం
రైన్ హార్వెస్టింగ్ చెయ్యం


పురపాలక, పీడబ్లుడి,
ప్రభుత్వం, సివిక్ సెన్స్ లేని జనం
మధ్య నాలుగుస్తంభాలాటలొ
నలిగి పొతున్న

నగరం...

ఇప్పుడు వర్షంలో
అందాలు ఆరబోసె
మత్తుకళ్ళ మందాకిని కాదు

డీసెంటెరి, డయొరియ, కలెర,
మలెరియ, డెంగు, ఆస్తమ, హెపిటైటిస్,
ఇత్యాది సుఖవ్యాదులతొ
సతమతమవుతున్న సాని

ఇప్పుడు నగరంలో వర్షమంటె
వర్షంలొ నగరం

Rain Rain go away
Never come again another day

No comments: