అద్దంలో నువ్వు అదివరికటిల లేవు
అది నీ తప్పు కాదు
వంచిన నీ తలకు...నా వంచనే కారణం
స్నేహం, ప్రేమ,సరదా
సమాజం, సహాయం అంటు
నా శక్తిని వ్రుధా చేసాను
నీ సమయాన్ని దగా చేసాను
పరొపకారం ఇదమ్ శరిరమంటు
కుక్కలకు కాపు కాసాను
గాడిదల బరువు మోసాను
అపకారికి ఉపకారమన్న వెర్రి భ్రమలొ
పాములకు పాలు పోసాను
తొడేల్లను తోడు రానిచ్చాను
నిన్ను ప్రేమించడమంటే స్వార్దమనుకున్నను
నిన్ను సేవించడమంటే స్వలాపేక్ష అనుకున్నాను
కాని అద్దంలో అలిసిన నిన్ను చుసి
అలస్యంగా నా తప్పు తెలుసు కున్నాను
...
నా వెన్ను తట్టి వెన్నంటె వున్న హితుడివి
నా నీడ విడిచినా తోడు నడిచిన ఆప్తుడివి
ఒటమిలో కూడా నన్ను ఒంటరి చెయ్యని ఒకే ఒక్క స్నేహితుడివి
ఎం చేసినా నీ రుణమెన్నడు తీర్చుకొలేను.
అందుకే...
పొత్తిల్ల నాటి మన అనుభందం సాక్షిగా
ప్రమానం చేసి చెబుతున్నా మిత్రమా
నీ కనురెప్పల కింద మళ్ళి నేను
కొత్త కలలను నేస్తాను
నా సర్వస్వం ఒడ్డైనా ఈసారి
ఆ స్వప్నాలన్నిటిని సాకారం చేస్తాను
నీ పెదవి చివర మల్లి నేను
విజయ బావుటాలు ఎగుర వేస్తాను
దించిన నీ తలపై కీర్తి కిరిటాన్ని
నా స్వహస్తలతొ అలంకరిస్తాను
అంతవరకు
నా దేహాన్ని,
మనసును,
ఆత్మను
సైన్యంగా మార్చి
విధినైనా విరొధిస్తాను
తుది సమరం గెలుస్తాను
...
అద్దంలో అతడు
యుద్దంలో ఇతడు
జీవిత జూదంలో
పొందినదెంత
పోగొట్టుకున్నదెంత తెలియాలంటె
అఖరి పాచిక వరకు ఆగాల్సిందే
ఆడాల్సిందే
అది నీ తప్పు కాదు
వంచిన నీ తలకు...నా వంచనే కారణం
స్నేహం, ప్రేమ,సరదా
సమాజం, సహాయం అంటు
నా శక్తిని వ్రుధా చేసాను
నీ సమయాన్ని దగా చేసాను
పరొపకారం ఇదమ్ శరిరమంటు
కుక్కలకు కాపు కాసాను
గాడిదల బరువు మోసాను
అపకారికి ఉపకారమన్న వెర్రి భ్రమలొ
పాములకు పాలు పోసాను
తొడేల్లను తోడు రానిచ్చాను
నిన్ను ప్రేమించడమంటే స్వార్దమనుకున్నను
నిన్ను సేవించడమంటే స్వలాపేక్ష అనుకున్నాను
కాని అద్దంలో అలిసిన నిన్ను చుసి
అలస్యంగా నా తప్పు తెలుసు కున్నాను
...
నా వెన్ను తట్టి వెన్నంటె వున్న హితుడివి
నా నీడ విడిచినా తోడు నడిచిన ఆప్తుడివి
ఒటమిలో కూడా నన్ను ఒంటరి చెయ్యని ఒకే ఒక్క స్నేహితుడివి
ఎం చేసినా నీ రుణమెన్నడు తీర్చుకొలేను.
అందుకే...
పొత్తిల్ల నాటి మన అనుభందం సాక్షిగా
ప్రమానం చేసి చెబుతున్నా మిత్రమా
నీ కనురెప్పల కింద మళ్ళి నేను
కొత్త కలలను నేస్తాను
నా సర్వస్వం ఒడ్డైనా ఈసారి
ఆ స్వప్నాలన్నిటిని సాకారం చేస్తాను
నీ పెదవి చివర మల్లి నేను
విజయ బావుటాలు ఎగుర వేస్తాను
దించిన నీ తలపై కీర్తి కిరిటాన్ని
నా స్వహస్తలతొ అలంకరిస్తాను
అంతవరకు
నా దేహాన్ని,
మనసును,
ఆత్మను
సైన్యంగా మార్చి
విధినైనా విరొధిస్తాను
తుది సమరం గెలుస్తాను
...
అద్దంలో అతడు
యుద్దంలో ఇతడు
జీవిత జూదంలో
పొందినదెంత
పోగొట్టుకున్నదెంత తెలియాలంటె
అఖరి పాచిక వరకు ఆగాల్సిందే
ఆడాల్సిందే
No comments:
Post a Comment