Wednesday, August 22, 2012

అతడు (Part 1)



అతడెందుకో అదివరకటిలా లేడు
అందమా అనందమా తగ్గింది
కళ్ళల్లొ మునుపటి కాంతి శిఖలు లేవు
పెదవులపై ఇంద్ర ధనస్సులు లేవు


ఎందుకనొ మరి అతను అదివరకిటిలా అస్సలు లేడు
దేహం వడలిందా ధైర్యం సడలిందా
యవ్వనానికి వ్రుద్దప్యానికి మద్య
కూలిన వంతెనలా అలా
ఒరిగి పొయాడు
పూర్తిగా ఒదిగి పొయాడు

గతం దిగుడు బావిలో
ఙ్నాపాకాల రాయి పడ్డప్పుడల్లా ఉలిక్కి పడతాడు

అనుభవాల ఉరికొయ్యలకి వేలాడుతున్న
అనుబంధాల కళెబరాలు
ఇంకా అతడికి
పచ్చిగానె తగులుతున్నాయా

రాజిల రాపిడిలొ రాలి బూడిదైన అశయాల
అవషెశాలు ఇంకా వెచ్చగానె
అతడిని వెన్నాడు తున్నాయా

అతడెందుకో మరి ఎడురుపడితె
అపరాధిలా తలదించుకునే వుంటాడు
అనుకున్నది సాదించలేదనా
అసలెమి సంపాదించలేదనా
అవసరమైనప్పుడు సాహసించలేదనా

అసలెందుకని తప్పు చెసినట్టు
తప్పించుకు తిరుగు తాడు?

ఒంటరిగానె ప్రపంచాన్ని గెలవాలని బయలు దేరిన వాడు
పాండవులే కౌరవులని తెలిసి బహుశా అస్త్ర సన్యాసం చేసాడు


ఇన్నెల్ల అఙ్నాన వాసం ముగిసి
సిగ్గుతొ అఙ్నాత వాసంలోకి వెల్లిపొయాడు
ఇప్పుడు ఎదురుపడ్డా
ఎరగనట్టే వుండిపొయాడు

అద్దంలో అతడు
అదివరకటిలా లేడు
అపరిచితుడిలా వున్నాడు


No comments: